పన్నెండేళ్లలో…లక్ష కేసులు పరిష్కారం

justicesudhiraggarwalచరిత్ర సృష్టించిన జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌

అలహాబాద్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ పన్నెండేళ్లలో ఏకంగా లక్ష వ్యాజ్యాలను పరిష్కరించి చరిత్ర సృష్టించారు. ఆయన అంకితభావంతో నిర్వహించిన విధి నిర్వహణను కొనియాడుతూ పలువురు అభినందనలు తెలిపారు. 2005, అక్టోబరు 5న జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2018, జనవరి 3వ తేదీ నాటికి లక్ష కేసుల రికార్డు సొంతం చేసుకున్నారు. వాటిలో 10వేల కేసులను హైకోర్టు లక్నో బెంచ్‌ న్యాయమూర్తిగా పరిష్కరించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం, బద్రికాశ్రమం జ్యోతి ష్య పీఠం, శంకరాచార్య వ్యవహారం లాంటి ప్రధానమైనవి కూడా ఆ కేసుల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వబడిలోనే చేర్చాలంటూ 2015లో ఆయన ఉత్తర్వులిచ్చి సంచలనం సృష్టించారు. పన్నెండేళ్ల క్రితం అలహాబాద్‌ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులైన ఆయన.. 2020 వరకూ న్యాయమూర్తిగా పదవిలో కొనసాగుతారు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy