పబ్ లో కాల్పులు…ఇద్దరి మృతి

vlcsnap-2016-01-02-18h31m00s57అదో బార్ అండ్ రెస్టారెంట్. అక్కడికో 28 ఏళ్ళ యువకుడు వచ్చాడు. బార్ లో  అటూ ఇటూ తిరిగి, తీరిగ్గా తన బ్యాగ్ తెరిచాడు. అందులోనుంచి ఒక ఆటోమేటిక్ రైఫిల్ బయటకు తీసి కాల్పులు జరిపాడు.

 

 

vlcsnap-2016-01-02-18h33m56s47ఇజ్రేల్ లోని టెల్ అవీవ్ సిటీ అది. అక్కడి డిజెంగాఫ్ రోడ్డులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కి శుక్రవారం వచ్చాడీ యువకుడు. బ్యాగ్ లోనుంచి ఆటోమేటక్ రైఫిల్ బయటికి తీశాక….వెంటనే బయటికి ఉరికాడు. రోడ్డుమీద కనిపించినవాళ్ళను  రైఫిల్ తో  ఇష్టమొచ్చినట్టు కాల్చేయడం మొదలుపెట్టాడు. పారిపోతున్నవాళ్ళ వెంటపడి మరీ కాల్చాడు. ఈ ఫైరింగ్ లో ఇద్దరు చనిపోయారు. ఏడుగురు బులెట్ దెబ్బలు తిన్నారు. బార్ లో కూడా ఫైర్ చేయడంతో అక్కడంతా భయానకంగా మారింది. ఫైరింగ్ తరువాత దగ్గరున్న ఫుడ్ స్టోర్స్ కి వెళ్ళి బ్యాగ్ అక్కడ పడేశాడు. అతని ఫైరింగ్ విజువల్స్  అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

vlcsnap-2016-01-02-18h37m46s40పోలీసులకు సమాచారం అందాక….అక్కడికి చేరుకుని….సీసీ కెమెరాలో విజువల్స్ ఆధారంగా అతని కోసం వెదికారు. కాసేపట్లోనే దొరికిపోయాడు. అతనిది అరారా అనే ఊరని పోలీసుల ఇంటరాగేషన్ లో తెలిసింది. అది ఇజ్రేల్ లోనే ఉన్నా అరబ్ జాతీయులే అక్కడుంటారు. కాల్పులు జరిపిన యువకుడికి ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఇంతకుముందు అతను ఒక నేరంలో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు చెప్పారు. అయితే అతని పేరు ప్రకటించలేదు కానీ ఫొటోను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఇద్దరూ మామూలు పౌరులే. వీరిలో ఒకరు బార్ మేనేజర్ ఉన్నాడు.

 

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy