పరమం పవిత్రం అయుత చండీయాగం

yaagamఅయుత చండీ యాగం.. చాలా పవిత్రమైన… శక్తివంతమైన యాగం. ఇందులో పాల్గొనేవారే కాదు… దగ్గరుండి తిలకించాలనుకునేవారుకూడా మనసును చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా దీక్షా వస్త్రాలు ధరించిన వారే యాగశాలలోకి ప్రవేశించడానికి అర్హులు. మిగతావారు బారికేడ్ల దగ్గర నుంచి చూసి వెళ్లొచ్చు. యాగం జరిగే రోజుల్లో హరికథలు, వాగ్గేయకారుల గీతాలు, భజనలు ఉన్నాయి. యాగం తొలి రోజు.. బెంగళూరు నుంచి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వస్తున్నారు. వీరితో పాటు చినజీయర్ స్వామి, మాధవానందస్వామి, స్వరూపానంద స్వామి, మంత్రాలయం, శ్రీ పీఠం పీఠాధిపతులు కూడా హాజరవుతున్నారు.

ప్రతిరోజూ పురాణ శ్రవణమే…

ఈ క్షేత్రంలో.. రాజశ్యామల యాగానికి, మహారుద్రయాగానికి, అయుత చండీ మహా యాగానికి వేర్వేరుగా యాగశాలలు ఉన్నాయి. మహిళల కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ యాగం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠం నుంచి వచ్చే ఆరుగురు ప్రధాన రుత్వికులు యాగాన్ని పర్యవేక్షిస్తారు. మరికొంతమంది రుత్వికులు…యాగశాలలోనే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రానికి చెందిన కొంతమంది బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజూ 50 వేల మంది భక్తులకు ప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు.. అందిస్తారు. ఇక ప్రతి రోజూ రెండు దఫాలుగా 2 వేల మంది మహిళలు కుంకుమార్చన చేసే అవకాశం ఉంది.

భక్తులకు ఇబ్బందుల్లేకుండా భారీ ఏర్పాట్లు

మహా యాగాన్ని భక్తులు తిలకించడానికి వీలుగా…యాగశాల ఉంది. ఈ యాగశాల చుట్టూ 8 నుంచి 10 వేల మంది ప్రదక్షిణలు చేసేందుకు.. వీలుగా ప్రత్యేక బారీకేడ్లు ఉంటాయి. రుత్వికులు, ప్రముఖులు, సాధారణ ప్రజలు.. ఇలా మూడు విభాగాలుగా… ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల కోసం మూడు ప్రత్యేక కాటేజీలు, ఇతర ముఖ్యుల కోసం మరో మూడు కాటేజీలు నిర్మించారు. ప్రముఖులు యాగాన్ని తిలకించడానికి వీలుగా ప్రత్యేక వసతి కల్పించారు. రుత్వికులు బస చేయడానికి మందిరాలను, 50 వేల మంది ఒకేసారి భోజనం చేయడానికి వీలుగా భారీ షెడ్డులను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం మందిరాలు ఉన్నాయి. అంతా కూర్చుని యాగాన్ని చూడడానికి వీలుగా ప్రత్యేక వ్యూ పాయింట్ కూడా ఉంది.

పూర్ణాహుతి రోజున రాష్ట్రపతి ప్రణబ్, ఏపీ సీఎం చంద్రబాబు

పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు వివిధ తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చలమేశ్వర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే. గవర్నర్లు నరసింహన్, రోశయ్య, విద్యాసాగర్ రావులు హాజరవుతున్నారు.

ఈ క్షేత్రానికి దగ్గరలో… ప్రముఖుల రాకపోకలకు వీలుగా ఐదు హెలిప్యాడ్లను నిర్మించారు. దాదాపు 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంది. ప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఉంటాయి. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. వీఐపీల పార్కింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉంది. మంచినీటి వసతి, పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వర్షం వచ్చినా యాగం నిర్విఘ్నంగా కొనసాగించడానికి వీలుగా పై కప్పు…అన్నీ పగడ్బంధీగా ఏర్పాటు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy