పరమ భక్తుడు : సాయిబాబాకు కోట్ల ఆస్తి విరాళం

saibabaకోట్లాది రూపాయల విలువ చేసే కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి సాయిబాబాపై ఉన్న భక్తిని చాటుకున్నాడు ఓ భక్తుడు. రూ. 32.27 కోట్ల విలువైన 2 భవంతులు, ఖాళీ ప్రదేశాన్ని బాబా ట్రస్టుకు ఉదారంగా ఇచ్చేశాడు. మహారాష్ట్రలో పాలిఘర్ జిల్లా కోప్రీ గ్రామానికి చెందిన కాశీనాథ్ గోవింద్ పాటిల్ షిర్డీలో ఉన్న తన ఆస్తులను అక్కడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు అప్పగించాడు. ‘సాయి పాల్కీ నివార’ పేరుతో వ్యవహరిస్తున్న ఈ భవంతులను ఇప్పటివరకూ.. కాలి నడక ద్వారా షిర్డీ సాయిబాబాను సందర్శించే వారి సౌకర్యం కోసం వినియోగిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో సంస్థాన్ నిర్వహించిన ఓ సమావేశం సందర్భంగా గోవింద్ పాటిల్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ స్థలాలను యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే గిరిజన విద్యార్థుల కోసం వినియోగించనున్నట్లు ట్రస్టు వర్గాలు తెలిపాయి. ట్రస్టు వర్గాలు కోటి 63 లక్షల రూపాయలు చెల్లించి, తమ పేరుతో ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. గోవింద్ పాటిల్ సంబంధిత పత్రాలను సాయినాథుడి పాదాల దగ్గర ఉంచిన తర్వాత వారికి అందజేశాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy