పరారైన ఆర్థిక నేరగాళ్ళ ఆస్తుల జప్తుకు కేంద్రం ఆర్డినెన్స్

notesఆర్ధిక నేరాలు చేసి దేశం వదిలి పారిపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శనివారం(ఏప్రిల్-21) జరిగిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక నేరాలకు పాల్పడి… విదేశాలకు పారిపోతున్నవారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించే ఆర్డినెన్స్ జారీ చేయడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ బిల్లును మార్చి 12న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ జరగలేదు, ఆమోదం పొందలేదు. దీంతో పరారైన ఆర్థిక నేరస్థుల ఆర్డినెన్స్, 2018 పేరుతో ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

పరారైన ఆర్థిక నేరస్థుల ఆర్డినెన్స్, 2018 అమల్లోకి వస్తే ఏ వ్యక్తినైనా పరారైన ఆర్థిక నేరగాడిగా సంబంధిత కోర్టు పరిగణించినట్లయితే.. ఆ వ్యక్తికి భారతదేశంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. ఆర్థిక నేరగాళ్ళ నేర సంబంధిత ఆస్తులను జప్తు చేసేందుకు భారతదేశ అధికారులకు అధికారం ఉందని తెలిపింది. దీంతో భారతదేశ న్యాయస్థానాల అధికార పరిథి నుంచి తప్పించుకునే ఆర్థిక నేరగాళ్ళను నిరోధించవచ్చునని తెలిపింది. పరారైన ఆర్థిక నేరగాళ్ళ నుంచి పెద్ద ఎత్తున రుణాలను రాబట్టుకునేందుకు కూడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అవకాశం కలుగుతుందని వివరించింది కేంద్ర మంత్రి వర్గం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy