పరిటాల ప్రధాన అనుచరుడు చమన్ మృతి

chamanఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత అయిన పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ (58) కన్నుమూశారు. ఈ ఉదయం అనంతపురం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మంత్రి పరిటాల సునీత తన కుమార్తె స్నేహలతకి పెళ్లి చేయబోతున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగానే మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉంటున్నారు చమన్. సోమవారం ఉదయం గుండెపోటుకి గురయ్యారు. వెంటనే స్పందించిన మంత్రి సునీత.. తన కాన్వాయ్ లోనే చమన్ ను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు చమన్.

పరిటాల బతికి ఉన్నప్పుడు కూడా ఆయనకు కుడి భుజంగా పని చేశారు. రాజకీయ, ఫ్యాక్షన్ వ్యవహారాలన్నీ చమన్ కనుసన్నల్లోనే జరిగేవి. పరిటాల కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. ప్రస్తుతం కూడా మంత్రి పరిటాల సునీత రాజకీయ వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు.  2014 – 2017 మధ్య రెండున్నర సంవత్సరాలు అనంతపురం జెడ్పీ చైర్మన్ గానూ పని చేశారు. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత.. 8 సంవత్సరాలు అజ్ణాతంలోకి వెళ్లాడు. 2012లో నల్లారి కిరణ్ సీఎం అయిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత బెయిల్ పై జైలు నుంచి వచ్చిన చమన్.. టీడీపీ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రామగిరి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014-2017 వరకు అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు చమన్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy