పరుగుల వీరుడి సినిమా మెప్పించింది

budhiaబుధియా సింగ్.. గుర్తున్నాడా? ఐదేళ్ళ లేప్రాయంలో 65 కిలోమీటర్ల దూరం అలుపు లేకుండా పరుగెట్టి దేశాన్ని, ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన బుడతడు.. కాదు పరుగుల వీరుడు. 2005-06 లో అతడో సంచలనం. మార్మోగిన పేరు. ఇపుడు పదహారేళ్ళ వాడు. ఈ బాల వీరుడి పరుగుల కథ సినిమాగా తెరకెక్కింది. బుధియా.. బోర్న్ టు రన్ అన్న ఆ సినిమా ఇవాళ రిలీజైంది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.

బుధియాగా మయూర్ పటోల్ నటించగా, అతనికి కోచింగ్ ఇచ్చిన బిరించి దాస్ పాత్రను మనోజ్ బాజ్ పాయ్ పోషించాడు. సౌమేంద్ర పాఢి ఈ సినిమాకు దర్శకుడు.

బుధియా ఇప్పటి దాకా 48 మారథాన్ లలో పాల్గొని పూర్తిచేశాడు. అన్నీ లాంగ్ డిస్టెన్స్ వే. నిజానికి ఈ ఒలింపిక్స్ లో అతనికి ఛాన్స్ దక్కాలి.. కానీ అతని వయసు సరిపోలేదు. ఈ కుర్రాడు ఇపుడే ఇంటర్నేషనల్ టోర్నీలకు వెళ్ళరాదని నిషేధం విధించింది ఒడిషా స్రీ శిశు సంక్షేమ శాఖ. ఆ బ్యాన్ ఎత్తేస్తేనే గానీ బుధియా మరిన్ని ఉన్నత లక్ష్యాలు చేరుకోలేడు.. సినిమాలో ఆ విషయమూ ఉంది.

దూరం పరిగెడితే షూస్ కొనిపెడతానని ఆశ చూపి బిరించి దాస్ ఆ బాలుడిలోని స్పార్క్ గుర్తించడం, ట్రైన్ చెయ్యడం, వాడుకోవడం.. ఇవన్నీ చూపారు. 111 నిమిషాల నిడివి గల ఈ సినిమా చూడాల్సిన సినిమా అంటున్నారు. అక్కడక్కడ రియల్ లైఫ్ సన్నివేశాలను చేర్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy