పర్యాటక ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా

pedapaliపెద్దపల్లి జిల్లాలో టూరిజం డెవలప్ మెంట్ పై ఫోకస్ చేశారు అధికారులు. జిల్లాలోని పురాతన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలపై దృష్టిపెట్టారు. జిల్లా అభివృద్దిలో భాగంగా పర్యాటక ప్రాంతాలను డెవలప్ మెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని రామగిరిఖిల్లా, సబితం జలపాతం, ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం, బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీరామపాదక్షేత్రం, నండిమేడారం, శిలలింగాల ప్రాంతాలను టూరిజం స్పాట్లు గా అభివృద్ది చేయాలని భావిస్తున్నారు.

ఓదేల గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవస్థానానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాచీన పురాతన ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. పక్క జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. యాదవులు కుల దైవంగా ప్రసిద్దిపొందిన మల్లికార్జునస్వామి జాతర, పట్నాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని అభివృద్ది చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు.

పెద్దపల్లి జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మరో ప్రదేశం రామగిరిఖిల్లా. శాతవాహనులు ఇదే ఖిల్లా నుంచి పాలన సాగించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కొండపై శాతవాహనుల కాలం నాటి కట్టడాలు, కోట ముఖద్వారాలు, ఈత కొలను, ఫిరంగులు, బురుజులు, కోట గోడలు ఇప్పటికి చరిత్రకు సాక్ష్యంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా స్పాట్ గా డెవలప్ చేయాలని భావించిన జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి…స్వయంగా రామగిరిఖిల్లాను ఎక్కి ఆకట్టుకున్నారు.

రామగిరిఖిల్లా పక్కనే ఉండే సబితం జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే స్పాట్. వర్షకాలంలో వాటర్ ఫాల్ చూసేందుకు ప్రజలు తరలివస్తుంటారు. కొండల మధ్యనుంచి దూకే జలపాతం కింద బాహుబలి సినిమాలోలాగా శివలింగం కనిపిస్తుంది. అయితే ఇక్కడకు వచ్చే టూరిస్టులు తరచు ప్రమాదాల బారిన పడుతున్నారు. సెక్యూరిటీ మెజర్స్ లేకపోవడంతో ఈ ఏడాది ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు. రోడ్డు మార్గం ఏర్పాటు చేసి…డెవలప్ చేస్తే జిల్లాలో పర్యాటకరంగానికి ప్లస్ అవుతుందంటున్నారు టూరిస్టులు.

ఇక జిల్లాలోని మరో పుణ్యక్షేత్రం బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం. బసంత్ నగర్ లోని కేశోరామ్ కంపెనీ యాజమాన్యం ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. రామగుండం వెళ్లే మార్గంలో ఉండే ఈ పురాతన ఆలయం దగ్గర నిత్యం నీటి ధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటి ధార గర్భగుడిలోని శివలింగంలోపలి నుంచి గుట్ట సందుల్లోంచి బయటకు వస్తుంది. శివుడే గంగను పంపిస్తున్నాడని భక్తుల నమ్మకం. దేవాదాయ ఆధీనంలోకి తీసుకుని ఆలయాన్ని అభివృద్ది చేయాలని కోరుతున్నారు.

పెద్దపల్లిలోని మరో పర్యాటక ప్రాంతం శ్రీరామపాదక్షేత్రం. రామగుండానికి కిలో మీటర్ దూరంలోనే ఉంటుంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడ తిరినట్లు భక్తుల నమ్మకం. రాముడి పాదులుగా భావించే 108 చిన్న చిన్న గుంటలు ఇక్కడ కనిపిస్తాయి. కొండ కింద చిన్న కొలను కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయోచ్చంటున్నారు స్థానికులు.

అవే కాకుండా నందిమేడారంలోని నంది, శివలింగాలు, కమాన్ పూర్ మండలంలో ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. బండపై వెలసిన మహావిష్ణువు అవతారంలోని వరహాస్వామి కొంచెం, కొంచెం పెరుగుతుండటం విశేషం. ఇక ప్రేమ పెళ్లిళ్లకు సుందిళ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్పెషల్. లవ్ మ్యారేజెస్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. వీటితో పాటు సుల్తానాబాద్ లోని మానేరు నంది, రంగనాయక స్వామి ఆలయం, మానేరు నది ఒడ్డున వెలసిన రామని పాదాలతో వెలసిన పురాతన ఆలయంతో పాటు గోదావరిఖని, ఎన్టీపీసీ, సింగరేణి ప్రాంతాలు పెద్దపల్లిలో ప్రత్యేకమైనవి. వీటన్నింటిని అద్యాత్మిక కేంద్రాలుగానూ…పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ది చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు జిల్లా అధికారులు.

4 Responses to పర్యాటక ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా

  1. Srinivas says:

    కథనం చాలా బాగుంది. All d best

  2. perumallasrinivas says:

    Excellent story.

  3. perumalla srinivas, Dy.manager, SCCL Ltd. says:

    సంపత్. you have done a good job. Keep it up

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy