పర్యావరణానికి నష్టం లేకుండా పరిశ్రమలు : కేటీఆర్

ktr-at-solarపర్యావరణానికి నష్టం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ యూనిట్ ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలో మంచి వనరులున్నాయని అన్ని రంగాలను ప్రోత్సహించడే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు కేటీఆర్.  2030 కల్లా కంద్ర ప్రభుత్వం ఎలక్రిక్ వెహికిల్స్ గా చర్యలు సోలార్ పవర్ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గోప్పది. రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన ప్రీమియర్ సోలార్ పరిశ్రమ మార్కెట్ లోకి విడుదల చేసింది.

రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా రెప్పపాటు క్షణం కరంటు పోకూడదనే ఉద్దేశంతో  తెలంగాణ  సర్కారు అహర్నిశలు కృషి చేస్తుంది. దీంతో రాష్ర్టానికి వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతే కాకుండా ఉన్న పరిశ్రమలకు అదనంగా విస్తరించుకోవడానికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

సౌరశక్తితో  అద్భుతాలు

సౌరశక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అన్న కేటీఆర్.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారికి ముందుకు వచ్చే వారికి ఇదే మా ఆహ్వానం అన్నారు. తెలంగాణ యువతలో నైపుణ్యానికి కొదవ లేదు. స్థానికులకు వందశాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా దృష్టి సారించాలి. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. టాస్క్ ద్వారా శిక్షణకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. టీఎస్‌ఐపాస్ జాతీయ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్ అమలు చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. టీఎస్‌ఐపాస్ ద్వారా రెండేళ్లలో 4వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులిచ్చామని ఛెప్పారు కేటీఆర్.

తెలంగాణలో వనరులకు కొదవ లేదు

కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నమని.. త్వరలోనే సంగారెడ్డిలో ఎల్‌ఈడీ బల్బుల తయారి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో వనరులకు కొదవ లేదు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభిస్తాం. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy