పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత : గవర్నర్

Narasimhanజీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదనీ.. అది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలన్నారు గవర్నర్ నరసింహన్. జీవవైవిధ్యంలో రైతులను భాగస్వాములను చేయాలని సూచించారు. మంగళవారం (మే-22) హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో.. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహన్.. జీవవైవిధ్యాన్ని కాపాడాలన్నారు. గవర్నర్ గా కాకుండా.. ఒక మనిషిగా చెబుతున్నానన్నారు. జీవవైవిధ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగు రామన్న.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy