పర్సనల్ ఇన్ కమ్ టాక్స్ ని రద్దు చేయాలి: సుబ్రమణ్య స్వామి

SUBరాజ్య సభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఎప్పటి లానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఇంకా పేదరికం..నిరుద్యోగ సమస్యలున్నాయన్నారు. ఇండియా అభివృద్ధి చెందాలంటే పదేళ్లపాటు 10 శాతం GDP వృద్ధిరేటు సాధించాలన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్  8వ ఎడిషన్ ఓపెన్ సెమినార్ లో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

తనను ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖా మంత్రిగా చేస్తే వృద్ది రేటు సాధించేలా చర్యలు తీసుకుంటానన్నారు. పీవీ నర్సింహారావు 1991 లో చేసిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపాయన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే పర్సనల్ ఇన్ కమ్ టాక్స్ ని రద్దు చేయాలన్నారు. అంతేకాదు రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు విదేశీ బ్యాంకుల్లో 120 లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారని..వాటన్నింటినీ తిరిగి ఇండియా కి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. మన దేశంలో వనరులకు కొదువలేదన్న స్వామి… వాటి నిర్వహణ సవాల్ గా మారిందన్నారు. ఇండియాలో 70 శాతంకి పైగా యువత ఉందని…వారికి సరిగా విద్యనందిస్తే ప్రపంచంలోనే అన్ని రంగాల్లో ముందుంటామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాని గా ఉన్నా… సోనియా గాంధీ చెప్పిందే చేసేవాడన్న సుబ్రమణ్య స్వామి.. స్లేవరీ సిస్టం నుండి బయటకి వచ్చి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy