పల్లకెలె రెండో వన్డే : 3 వికెట్లతో టీమిండియా విజయం

matchశ్రీలంకతో పల్లెకలె వేదికగా గురువారం (ఆగస్టు24) జరిగిన రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 44.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భువనేశ్వర్ కుమార్, ధోనీ మంచి ప్రదర్శనతో భారత్‌కు విజయాన్ని అందించారు.

మొదట టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నస్టానికి 236 పరుగులు చేసింది. తర్వాత వర్షం కారణంగా భారత్ ఇన్సింగ్స్‌ను 47 ఓవర్లకు కుదించి 231 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు నిర్వహకులు. దీంతో 231 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించారు.  109 పరగుల దగ్గర రోహిత్ శర్మ (54) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత వెంటనే శిఖర్ ధావన్ (49) పెవిలియన్ చేరాడు. ఇక వరుసగా వికెట్లు కోల్పోతూ తీవ్ర నిరాశ పరిచింది కోహ్లీ సేన. వరుసగా వికెట్ల పతనం మొదలై స్కోరు 131 పరుగు వరకు వచ్చే సరికి 7 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ధోనీ (43), భువనేశ్వర్ కుమార్ (53) ఇన్సింగ్స్‌ను చక్కదిద్ది నిలకడగా ఆడుతూ జట్టకు విజయాన్ని అందించారు.

శ్రీలంక యువ స్పిన్నర్ ధనంజయ అద్భుత ప్రదర్శన చేశాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లను తన స్పిన్‌తో మాయ చేసిన పెవిలియన్ బాటపట్టించాడు. టీమిండియా  కోల్పోయిన 7 వికెట్లలో ధనంజయ 6 వికెట్ల తీసుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy