పల్లడం తరహాలో సిరిసిల్ల పార్క్: కేటీఆర్

ktr-palladamటెక్స్ టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో పర్యటించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఒక్కరోజు పర్యటనలో మంత్రితో పాటు  పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.

35 వేల కోట్ల రూపాయల విలువైన వస్త్ర పరిశ్రమగా ఎదిగిన చిన్న గ్రామం తిరుపూర్ ను మంత్రి సందర్శించారు. అక్కడి నేత కార్మికులతో మాట్లాడారు. తిరుపూర్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ – TEA ప్రతినిధులతో సమావేశమయ్యారు. మనదేశంతో పాటు విదేశాలకు కూడా వస్త్రాలను ఎగుమతి చేస్తున్న తిరుపూర్ సక్సెస్ స్టోరీని తెలుసుకున్నారు. ఇక్కడ టెక్స్ టైల్ క్లస్టర్ అభివృద్ది కోసం అమలుచేసిన వ్యూహాలు,మార్కెటింగ్ ప్లాన్స్ పై ప్రతినిధులతో చర్చించారు. పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంలోనే తిరుపూర్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ విజయాలు సాధించిందని మంత్రికి ప్రతినిధులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటుచేయబోతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ గురించి మంత్రి వారికి వివరించారు.

TEA ప్రతినిధులు తమ ఎక్స్ పీరియన్స్ తో పాటు నాలెడ్జ్ షేరింగ్ కు ముందుకు రావాలని కోరారు కేటీఆర్. తిరుపూర్ లో ఉన్న వస్త్ర పరిశ్రమలు తమ విస్తరణ ప్రణాళికలో వరంగల్ కే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లే కు అవసరమైన అన్ని సౌకర్యాలు, అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు మంత్రి. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో కార్మికులు, ఇన్వెస్టర్లకు హౌజింగ్ , విద్య,  ఆరోగ్యం తో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. TEA ప్రతినిధులకు ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తామన్నారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో కనీసం పది యూనిట్ల ఏర్పాటుకు TEA ప్రతినిధులు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.

తిరుపూర్ నుంచి పల్లడం హైటెక్ వీవర్స్ పార్క్ కు మంత్రి కేటీఆర్ వెళ్లారు. చేనేత నుంచి మరమగ్గాల వైపు నేతన్నలను నడిపించి వారి జీవనోపాధి పెంచిన పార్క్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. సిరిసిల్ల పార్క్ ను పల్లడం మోడల్ లో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

కోయంబత్తూర్ లోని ప్రముఖ టెక్స్ టైల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ PSG తో రాష్ట్ర ప్రభుత్వం MOU కుదర్చుకుంది. వరంగల్ లో ఏర్పాటుచేయబోయే టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటులో  అకాడమిక్- టెక్నికల్ అసిస్టెంట్, స్కిల్ డెవలప్ మెంట్ , ఎంట్రపెన్యూర్ షిప్ ట్రైనింగ్ , ఆర్ అండ్ డి విభాగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తన భాగస్వామ్యాన్ని PSG విద్యాసంస్థ అందించనుంది. అవసరమైన ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుంది. కాలేజీలోని సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్, అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సాంకేతిక శాస్త్రాలను చదువుతున్న విద్యార్థులు  వినూత్నమైన ఆలోచనలతో ఎంట్రపెన్యూర్ షిప్ వైపు వెళ్లాలని సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy