పల్లెకలే టెస్టు : ధావన్ సెంచరీ

593570-417490-shikhar-dhawan-test-clb-700మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు ధావన్‌-రాహుల్‌ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి సెషన్‌ మొత్తం బ్యాట్స్‌మెన్లు తమ హవాను కొనసాగించారు. శ్రీలంక పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శనతో ఓపెనర్లు ఇచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయారు. దీంతో చెలరేగిన  ధావన తన టెస్టు కెరీర్లో 106 బంతుల్లోనే శతకం సాధించడం ఇదే తొలిసారి.  ఈ సిరీస్‌లో ధావ‌న్‌కు ఇది రెండ‌వ సెంచ‌రీ కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను శ్రీలంక‌పై మూడు సెంచ‌రీలు చేశాడు. 188 పరుగులవద్ద రాహుల్ (85) ఔట్ అయ్యాడు. 45 ఓవర్లకు వికెట్ నష్టానికి భారత్ స్కోర్ 211/1 పరుగులు చేసింది. ధావన్(116 నాటౌట్),  (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy