పల్లెకెలె: సిరీస్ భారత్ కైవసం

odiటీమిండియా తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం (ఆగస్టు27) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇండియా. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సొంతం చేసుకుంది. టాపర్డర్ ఘోరంగా విఫలమైనా ఓపెనర్ రోహిత్ శర్మ (124) సెంచరీతో అదరగొట్టాడు. ధోనీ (67)తో కలసి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. రెండో వన్డేలో ఓటమి అంచుల వరకు వెళ్లిన టీం ఇండియాను భువనేశ్వర్ కుమార్‌‌తో కలసి ఆదుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. మూడో వన్డేలోనూ అదే రిపీట్ చేశాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. లహిరు తిరిమన్నే (80) టాప్ స్కోరర్. దినేష్ చండిమల్ 36, మిలిందా సిరివర్దన 29, కపుగెదెర 14, డిక్వెల్లా 13, ఏంజెలా మాథ్యూస్ 11 పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఒక అంకె పరుగులకే పరిమితమయ్యారు. బుమ్రా కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

218 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (5)ను మలింగ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో చమీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  లోకేష్ రాహుల్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ వెంటనే కేదార్ జాదవ్ కూడా డకౌట్‌ అయ్యాడు. దీంతో 61 పరుగులకే భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ధోనీతో కలసి రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ కలసి ఐదో వికెట్‌కి 157 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 45.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్లు తీసిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

టీమిండియా తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం (ఆగస్టు27) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇండియా. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సొంతం చేసుకుంది. టాపర్డర్ ఘోరంగా విఫలమైనా ఓపెనర్ రోహిత్ శర్మ (124) సెంచరీతో అదరగొట్టాడు. ధోనీ (67)తో కలసి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. రెండో వన్డేలో ఓటమి అంచుల వరకు వెళ్లిన టీం ఇండియాను భువనేశ్వర్ కుమార్‌‌తో కలసి ఆదుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. మూడో వన్డేలోనూ అదే రిపీట్ చేశాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. లహిరు తిరిమన్నే (80) టాప్ స్కోరర్. దినేష్ చండిమల్ 36, మిలిందా సిరివర్దన 29, కపుగెదెర 14, డిక్వెల్లా 13, ఏంజెలా మాథ్యూస్ 11 పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఒక అంకె పరుగులకే పరిమితమయ్యారు. బుమ్రా కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

218 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (5)ను మలింగ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో చమీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  లోకేష్ రాహుల్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ వెంటనే కేదార్ జాదవ్ కూడా డకౌట్‌ అయ్యాడు. దీంతో 61 పరుగులకే భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ధోనీతో కలసి రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ కలసి ఐదో వికెట్‌కి 157 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 45.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్లు తీసిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy