పల్లె బ్యాంకుల పిలుపు : ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

rural-bankతెలంగాణలో 1,073 ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ లో 471 ఉద్యోగాలు

పల్లెల్లో సామాజికాభివృద్ధిని కాంక్షిస్తూ అక్కడి అవసరాలను తీర్చడానికి ఏర్పడిన గ్రామీణ బ్యాంకుల్లో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ఐబీపీఎస్. దేశవ్యాస్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 5,123 ఆఫీసర్ పోస్టులు, 8,298 ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 1,073 ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ లో 471 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది ఐబీపీఎస్.

 

తెలంగాణలో..

 

బ్యాంకు పేరు                                                           ఆఫీస్ అసిస్టెంట్        ఆఫీసర్

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్                                     331                     107

తెలంగాణ గ్రామీణ బ్యాంక్                                              415                     220

  మొత్తం                                                               746                     327

 

ఆంధ్రప్రదేశ్ లో..

 

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్                                        25                          46

చైతన్య గ్రామీణ బ్యాంక్                                             125                         65

సప్తగిరి గ్రామీణ బ్యాంక్                                             100                        110

మొత్తం                                                            250                        221 

 

ఆఫీస్ అసిస్టెంట్ : 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. బ్యాంకులున్న ప్రాంతాన్ని బట్టి స్థానిక భాషలో ప్రావీణ్యత అవసరం. కంప్యూటర్ అవగాహన ఉండాలి.

ఆఫీసర్ : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కానీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్,  అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసి కల్చర్,  అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజిమెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యమిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యత ఉండాలి. కంప్యూటర్ అవగాహన తప్పనిసరి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy