పళనిస్వామికి గవర్నర్ పిలుపు

Tamilnadu-vidyasagarrao2aఅన్నాడీఎంకే ఎల్పీ నేత పళనిస్వామి కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో   ఆయన ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. తనకు మెజార్టీ ఉన్నందున తనను పిలవాల్సిందిగా కోరనున్నారు. అలాగే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లెటర్ ను కూడా విద్యాసాగర్ రావుకు ఇవ్వనున్నారు.

పళనిస్వామికి తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు సాయంత్రం 5.30 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే… 12 మంది అన్నాడీఎంకే మంత్రులతో కలిసేందుకు గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయలు దేరి రాజ్ భవన్ బయలు దేరిన సంగతి తెలిసిందే.

పళనిస్వామిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నట్టు శశికళ గవర్నర్ కార్యాలయానికి ఫ్యాక్స్ లో సమాచారం అందించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ పిలుపు రావడంతో తమిళనాట కొత్త వూహాగానాలు వూపందుకున్నాయి.

125 మంది ఎమ్మెల్యేలు ఉన్న పళనిస్వామి వర్గానికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతిస్తారని పార్టీ వర్గాల ఆలోచన. ఇంకోవైపు తన మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో ఉన్నారు పన్నీర్‌సెల్వం. రెండు గంటల్లో తమిళనాడులో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో.. తేలనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy