పళని బలపరీక్ష ఇవాళే

Untitled-1తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష జరగబోతోంది. సీఎం పళనిసామి.. బలం నిరూపించుకునేందుకు సిద్దమయ్యారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కావాలని విప్ జారీ చేశారు. మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీలో  ప్రస్తుతం 234 ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. అందులో.. శశికళ వర్గంలో 122 మంది..పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష డీఎంకేకు.. 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ 8.. ఐయూఎంఎల్ 1 సభ్యుడిని కలిగి ఉన్నాయి. ఓ స్థానం ఖాళీగా ఉంది. అధికారాన్ని అందుకోవడానికి 117 మంది సభ్యుల మేజిక్ ఫిగర్ అవసరం అవుతుంది. కానీ.. అన్నాడీఎంకేలోని 2 వర్గాల బలాబలాల్లో.. క్షణక్షణానికి మార్పులు జరుగుతున్నాయి. మొన్నటివరకూ శశికళ వర్గంలో ఉన్న ఆర్.నటరాజన్.. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తానని చెప్పారు. అలాగే… గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేల్లో.. మరింత మంది అసెంబ్లీకి చేరుకున్నాక ప్లేట్ ఫిరాయించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. కొత్త సీఎం పళని సామికి ఎందరు ఎమ్మెల్యేలు మద్దతిస్తారు.. సెల్వంకు ఎందరు జై కొడతారన్నది.. ఉత్కంఠను పెంచుతోంది.

పళని వ్యతిరేకంగా డీఎంకే

మరోవైపు అసెంబ్లీలో బలపరీక్షకు హాజరయ్యే విషయంలో ప్రతిపక్ష డీఎంకే.. స్టాండ్ మార్చుకోవడం తమిళ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. సభకు హాజరై పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని డీఎంకే ప్రకటించింది. అంతకుముందు.. బలపరీక్షను బహిష్కరిస్తున్నట్టు డీఎంకే ప్రకటించినా.. అడుగడుగుకు మారిపోతున్న రాజకీయాలతో చివరికి సభకు అటెండ్ కావాలన్న నిర్ణయానికి వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సుదీర్ఘ సమావేశం తర్వాత.. డీఎంకే నేత స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy