పవన్ కల్యాణ్ ట్విట్టర్ హ్యాక్

pawan-hackedపవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అకౌంట్ ఓపెన్ అవుతున్నా.. అందులో పోస్టింగ్ కావటం లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు. మే 7వ తేదీన తిరుమల ఈవో అంశం నియామకంపై చివరిసారిగా ఆయన పోస్టింగ్ ఉంది. ఆ తర్వాత ఎలాంటి ట్విట్ చేయలేదు. పవన్ ట్విట్టర్ లో 18లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించటానికి ప్రయత్నిస్తే పోస్టింగ్ కాలేదని.. టెక్నికల్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చని రెండు రోజులుగా భావించామని జనసేన ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ మాత్రం పాస్ వర్డ్ ఛేంజ్ అయినట్లు సూచించటంతో.. అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిసిందన్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది జనసేన పార్టీ. పవన్ పేరుతో ఎలాంటి ట్విట్స్ వచ్చినా పట్టించుకోవద్దని.. స్పందించవద్దని ప్రకటించింది పార్టీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy