పవన్ క్రేజే.. బాహుబలికి స్ఫూర్తి

pawanబాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కు ఇప్పటికే ప్రజలు సాహో అంటున్నారు. సినిమా మొత్తంలో ఈ సీన్ హైలెట్ గా నిలిచిందని ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. . తనకు ఈ సన్నివేశానికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తినిచ్చాడని మనసులో మాట బయటపెట్టారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండాలి.. అనే విషయంపై చాలా చర్చలు జరిగాయని.. అయితే ఫైనల్ గా ఒక కాన్సుప్ట్ ఓకే చేశామన్నారు. ‘భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతున్న సమయం.. కానీ అతను సంతృప్తిగా లేడు. బాహుబలి.. బాహుబలి.. అంటూ జనం చేసే నీరాజనాలు చూసి అసూయతో రగిలిపోతాడు…’ ఇది ఫైనల్ సీన్ కాన్సెప్ట్. ఎలా రాయాలో అర్ధం కాని టైంలో అనుకోకుండా టీవీలో  ఏదో ఆడియో ఫంక్షన్‌ చూశానని.. పవన్‌ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా పవన్‌ పేరు పలికినప్పుడు పబ్లిక్ పెట్టే కేకలకు అక్కడ ఐదు నిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా కనీసం వినిపించ లేదన్నారు. అప్పుడు స్టేజీ పై ఎవరు ఉన్నా.. హీరో ఎవరైనా సరే…అసూయ పడాల్సిందే.. ‘ఇదేదో బాగుంది కదా’ అనుకోని ఆ సీన్ రాసినట్లు ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు విజయేంద్ర ప్రసాద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy