పవన్ చీఫ్ గెస్ట్ : నా పేరు సూర్య సక్సెస్ మీట్

PKవక్కంతం వంశీ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా విడుదలై సక్సెస్ తో దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీ సకెస్స్ సంబరాల్ని గ్రాండ్ లెవల్ లో చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది యూనిట్. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరౌతుండడం విశేషం. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదికపైకి వస్తుండడంతో ఫంక్షన్ ను భారీస్థాయిలో చేయనున్నారు. మే 10వ తేదీన ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ హైదరాబాద్ లో జరుగుతాయి.

ఈ సందర్భంగా సినిమా నిర్మాతలు మాట్లాడుతూ…. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మనందరం గర్వపడే సినిమా. చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఉప్పొంగిపోయే మూవీ. మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ ఈ సినిమాను ప్రధాన బలం. వక్కంతం వంశీ దర్శకుడిగా తన స్టామినా చూపించి సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులంతా ముక్తకంఠంతో భారీ కలెక్షన్స్ దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశాం. బన్నీ అంటే అమితంగా ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదిక మీదకు వస్తే అభిమానుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy