పవన్ టూర్ : కొండగట్టు స్వామికి పూజలు

ING-220118-KMNR-PAVAN2PM1-2జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టులో పూజలు చేశారు. సోమవారం (జనవరి-22)న పార్టీ నేతలో కలిసి కొండగట్టు అంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన ఆయన.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా  ఆలయ అభివృద్ధి కోసం పవన్.. రూ. 11 లక్షలు విరాళం ఇచ్చారు. ఆలయం దగ్గరకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. పూజల తర్వాత బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ తన కారుపై ఎక్కి అభివాదం చేశారు. తర్వాత కొండగట్టు నుంచి కరీంనగర్ వెళ్లారు. ఈ రాత్రికి పవన్ అక్కడే ఉంటారు.

మంగళవారం (జనవరి-23) ఉదయం 10.45 కు కరీంనగర్ లోని జగిత్యాల రోడ్ లో ఉన్న శుభం గార్డెన్స్ లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం బయల్దేరి వెళతారు. రాత్రి కొత్తగూడెంలోనే ఉండనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 కు కొత్తగూడెం నుంచి ర్యాలీగా మధ్యాహ్నం 1.30 వరకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు పవన్. మీటింగ్ తర్వాత ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు 3 జిల్లాల్లో రాజకీయ యాత్ర చేయనున్నారు పవన్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy