పవన్, త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభం

pavan - trivikramపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. సోమవారం రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా షూటింగ్ మొదలైంది. పవన్ సరికొత్తగా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనిపించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీని ఆగష్టు నెలకల్లా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

జల్సా మూవీ రిలీజ్ డేట్‌ను సెంటిమెంట్‌గా భావించి ఇదే రోజున పవన్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. తొలిరోజు షూటింగ్ లోనే పవన్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ బడ్జెట్‌తో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్‌ని వేసిన విషయం తెలిసిందే.

ఫస్ట్ షెడ్యూల్ ని ఈ సెట్ లోనే మొదలెట్టారు. ఈ చిత్రంలో త్రివిక్రమ్ పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు. షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ తో పాటు చిరకాల మిత్రుడు, నిర్మాత శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy