పవన్, నితిన్ ఫ్యాన్స్ కి వాలంటైన్స్‌డే గిఫ్ట్

NITHINయంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చల్ మోహన్ రంగ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను  వాలంటైన్స్‌డే కానుకగా బుధవారం (ఫిబ్రవరి-14) ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు నితిన్.  లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న నితిన్ సరసన  మేఘా ఆకాశ్ హీరోయిన్  గా నటిస్తుంది. థ‌మ‌న్ మ్యాజిక్ . ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. జయం, దిల్, ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ..ఆ లాంటి లవ్ స్టీరీలతో ఆకట్టుకున్న నితిన్..  ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy