పవన్ ను డైరెక్ట్ చేయనున్న జానీ మాస్టర్

pawan with johny masterజానీ మాస్టార్.. సూపర్.. అదుర్స్.. ఇరగదీసేశారు.. చించేశారు.. బుల్లితెరపై డాన్స్ షో చూసేవాళ్లకు ఈ మాటలు రొటీన్.. ఇప్పుడే ఇదే జానీ మాస్టార్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోయాడు. రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడే మూవీస్ తో టాప్ లిస్ట్ లో చేరిపోయాడు.. ఇప్పడు మరో గొప్ప అవకాశాన్ని కూడా కొట్టేశాడు. అల్లాటప్పా కాకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ నే డైరెక్ట్ చేయబోతున్నాడంట.. తంతే ఫ్రూట్స్ బుట్టలో పడినట్లు.. అనికోని వరానికి డాన్స్ చేస్తున్నాడంట జానీ మాస్టార్. తన సొంతంగా తయారు చేసుకున్న కథను.. దాసరి నారాయణరావుకు చెప్పేందుకు వెళ్లాడంట.. కథ విన్న ఈ పెద్దాయన సూపర్ అన్నాడంట.. అనటమే కాదు.. నేనే పవన్ కళ్యాణ్ తో నిర్మించబోయే సినిమాకు నువ్వే డైరెక్ట్ చేద్దువు అని కమిట్ మెంట్ ఇచ్చేశాడంట. ఎవరో ఒకరు అనుకుంటున్న టైంలో పవర్ స్టార్ నే డైరెక్ట్ చేసే అవకాశం రావటంతో ఎగిరి గంతేస్తున్నాడీ మాస్టార్.. ఇప్పటికే ప్రభుదేవ, లారెన్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నవారే..

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy