పవన్ సంచలన ట్విట్స్ : బట్టలు విప్పి మాట్లాడుకుందాం రండి

pawan-kalyan-tweetచెప్పిన టైంకి.. చెప్పినట్లు ట్విట్టర్ లో వచ్చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రేపు ఉదయం 10 గంటలకు మరిన్ని విషయాలు వెల్లడిస్తానని.. అందరి బాగోతాలు బయటపెడతానని చెప్పిన పవర్ స్టార్.. అన్నంత పనీ చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థులకు పంచ్ లు ఇచ్చారు. తనను బ్లాక్ మెయిలర్ అని ఓ ముఖ్యమంత్రి అన్నారని.. ఓ మంత్రి మరొకరితో చెప్పారని.. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలని ఉందా అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఆ మంత్రి టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని తేలిపోయింది.. మంత్రి పేరుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైపోయింది.

స్టే ట్యూన్డ్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్.. నిజాలు నిగ్గు తేలుద్దాం ప్రోగ్రామ్ నుంచి మీ పవన్ కళ్యాణ్ అని కెమెరామెన్ గంగతో రాంబాబు స్టైల్లో ట్వీట్స్ చేశారు. నాకిష్టమైన స్లోగన్ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయడం.. అసలీ స్లోగన్ వెనకాల కథ.. యీ స్లోగన్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఓ ఛానల్ లో ప్రసారం అయ్యే ప్రోగ్రాం ఇది.. దీని వెనక అసలు కథ ఏంటో చెబుతా అంటున్నారు. ఇక బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం మొదలైంది అని స్పష్టం చేస్తూ ట్విట్ చేశారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అని వరుస ట్వీట్లతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. జనసేన అధినేత, పవర్ స్టార్ ట్విట్లపై అప్పుడే కలకలం మొదలైపోయింది. ఎవరెవరి బాగోతాలు బయటపెట్టనున్నారో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy