పవర్ గర్ల్: కట్టె తిప్పిన సమంతా..

samantha-hobbyసమంత కొత్తగా కర్రసాము నేర్చుకుంటోంది. ఏ సినిమా కోసం అని అడిగితే..తనకు ఛాలెంజ్ అంటే ఇష్టమని.. ఇది నా హాబీ అంటోంది ఈ సుందరి. తాజాగా సమంతా జిమ్ సూట్ లో కర్రను స్పీడుగా తిప్పుతున్న వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తొంది. నాగచైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. త్వరలోనే కర్రసాము(సిలంబం) విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తానంటూ సోషల్ మిీడియా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం నాగార్జునతో రాజుగారి గది – 2లో…  రామ్ చరణ్, సుకుమార్‑ల కాంబినేషన్‑లో తెరకెక్కుతున్న చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పినట్టు సమాచారం. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది సొట్ట బుగ్గల సుందరి సమంత.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy