పవర్ నిరంతరం అందాల్సిందే..!

TRS president K. Chandrashekar Rao with BJP president Rajnath Singh during a meeting in New Delhi on Feb.25, 2014. (Photo: IANS)ఇన్ టైమ్ లో పవర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిసైడైంది రాష్ట్ర ప్రభుత్వం. వీలైనంత త్వరగా నిరంతర విద్యుత్ అందించేందుకు ప్లాన్ చేస్తోంది. క్యాంప్ ఆఫీస్ లో విద్యుత్ అధికారులతో రివ్యూ చేసిన సీఎం.. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

విద్యుత్ శాఖపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. పవర్ ప్రాజెక్టులను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ అందించాలని.. ఇతర వర్గాలకు పవర్ కట్స్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. క్యాంప్ ఆఫీస్ లో ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కం అధికారులతో సమీక్ష చేసిన  సీఎం..  2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న 4 వేల 445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని.. ఈ ఏడాది చివరినాటికి 4600 మెగావాట్లకు పెంచాలని సూచించారు.

ఈనెల 5న వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ యూనిట్ ను.. జాతికి అంకితం చేయనున్న సీఎం.. ఇతర ప్రాజెక్టులన్నీ ఇన్ టైమ్ లో పూర్తి చేయాలని ఆదేశించారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. పవర్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. సింగరేణి సంస్థ జైపూర్ లో నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్.. ఏప్రిల్ వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. మణుగూరులో 1080, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్ల పనులు.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని చెప్పారు. వార్దా నుంచి మహేశ్వరం వరకు డబుల్ సర్క్యూట్ లైన్లు వేస్తున్నందున.. ఈ ఏడాది చివరి వరకు.. ఛత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తీసుకునే చాన్సుందన్నారు. ఏప్రిల్ వరకు 800 మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ ఏడాది కాలంలో మరో 2వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సాధ్యమౌతుందన్నారు అధికారులు. వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించే దిశగా.. కృషిచేయాలని అధికారులకు సూచించారు సీఎం. దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకుపోవాలన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy