పశ్చిమ బెంగాల్ : గవర్నర్ తో ఢీకొడుతున్న దీదీ

didiపశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. గవర్నర్ తీరుపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ – బీజేపీ మధ్య మరోసారి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి మాటలు వెళ్లాయి.

ఎందుకీ రాద్దాంతం :

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24పరగణాల జిల్లా బదురియాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ అంశంపై  గవర్నర్ తో ఫోన్ల మాట్లాడారు దీదీ. అయితే ఫోన్ లో గవర్నర్ మాట్లాడిన తీరు బాగోలేదని బహిరంగంగానే విమర్శలు చేశారు మమత. తనతో మాట్లాడిన ప్రతిసారీ గవర్నర్ అవమానిస్తున్నరని మండిపడ్డారు. ఆయన వాడుతున్న భాష తన జీవితంలో ఇప్పటి వరకు వినలేదంటూ బాంబ్ పేల్చారు. గవర్నర్  బీజేపీ బ్లాక్  అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.  రాజ్యాంగ పదవిలో ఉన్న త్రిపాఠి ఒకవర్గం వైపే మాట్లాడితే ఎలా అని నిలదీశారు సీఎం మమత. బెంగాల్ రాజ్ భవన్ ఆర్ఆర్ఎస్ శాఖ ఆఫీస్ లా తయారైందని తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం మమత చేస్తున్న విమర్శలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ లో పోలీస్  రాజ్యం నడుస్తుందన్నారు. గవర్నర్ వాస్తవాలు మాట్లాడితే టీఎంసీ నేతలకు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదంటూ విరుచుకుపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy