పాకిస్తాన్ లో సంక్షోభం : ప్రధాని షరీఫ్ పదవికి గండం

supreme-court-pakదాయాది దేశంలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. పనామా కేసులో ప్రధాని నవాజ్ షరీఫ్ పై జరుగుతున్న విచారణలో.. ఆ దేశ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను కట్టకుండా ఆస్తులను దేశం నుంచి తరలించారని నిర్ధారించింది కోర్టు. షరీఫ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఐదు జడ్జిల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. డొల్ల కంపెనీల ద్వారా నగదు చెలామణికి పాల్పడ్డారని తేల్చింది కోర్టు. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవికి అనర్హుడని డిసైడ్ చేసింది. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్.

1990లో లండన్, గల్ఫ్ దేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని.. ఇదంతా పాకిస్తాన్ నుంచి అక్రమంగా తరలివెళ్లిన డబ్బే అని పనామా ఎజెన్సీ పేపర్స్ లీక్ చేశాయి. షరీఫ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఆ పేపర్స్ చెబుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. శుక్రవారం ఐదు జడ్జిల ధర్మాసనం షరీఫ్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. షరీఫ్.. ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఊహించని తీర్పుతో షాక్ అయ్యారు షరీఫ్. తదుపరి చర్యలపై పార్టీలో చర్చిస్తున్నారు. 2018లో అక్కడ పార్లమెంట్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది.

నవాజ్ షరీఫ్ పదవి నుంచి దిగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో పాకిస్తాన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పుడు పవర్ అంతా ఆర్మీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే భారత్ తో కవ్వింపులు మరింత పెరగనున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy