పాకి.. నడిచి..ఎక్కి.. ఈతకొట్టే రోబో ఇది!

Untitled-7ఇది రోబోల కాలం. ఎన్నెన్నో ఫీచర్లతో కొత్త కొత్త రోబోలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైంటిస్టులు ఓ త్రీ డైమెన్షనల్ రోబోను తయారు చేశారు. ముందు వెనకలకు నడుస్తూ, ఓ తరంగంలో వంగి వెళుతూ, ఎదురుగా ఎత్తైనవి అడ్డొస్తే వాటిపైకి ఎక్కి, దిగి వెళుతూ, పాకుతూ, ఈత కొడుతూ వెళ్ళగలవీ రోబోలు. ఎలాంటి సంక్లిష్టమైన ఉపరితలంపైన అయినా వెళ్ళగలవు, గడ్డి మీద, కంకరమీద నడిపోగలవు. దీన్ని “సింగిల్ ఏక్చువేటర్ వేవ్-లైక్ రోబో (ఎస్ ఎ డబ్ల్యు) అంటారు. ఇజ్రాయెల్ లోని నెగెవ్ లో ఉన్న బెన్ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. సెకనకు 57 సెంటీమీటర్ల దూరం నడచి పోగలదీ రోబో.. అంటే ఇతర రోబోల కన్నా ఐదు రెట్ల వేగం గలది. ఓ రకంగా ఇది గొంగళిపురుగు మాదిరిగా ముందు వెనకలకు పాకుతూ తరంగం మాదిరిగా వెళ్ళగలదు. వైద్య పరమైన అవసరాలకు, భద్రత, సెర్చింగ్, సహాయ కార్యక్రమాల్లో దీన్ని వాడొచ్చు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy