పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అబ్బాసీ

shahid-khaqan-abbasiపాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) నేత షహీద్‌ ఖాకన్‌ అబ్బాసీ ఎన్నికయ్యారు. దిగువసభ నేషనల్‌ అసెంబ్లీలో ఆయనకు మద్దతుగా 221 ఓట్లు లభించినట్లు పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడగా.. చివరికి అబ్బాసీనే విజయం సాధించారు. నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా.. విజయం సాధించడానికి 172 ఓట్లు కావాలి. అంతకంటే ఎక్కువ ఓట్లనే అబ్బాసీ పొందారు. పనామా గేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవికి అనర్హుడంటూ ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం పాక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికైన అబ్బాసీపైనా అవినీతి కేసు ఉంది. రూ.22వేల కోట్ల విలువైన ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) కాంట్రాక్టు మంజూరులో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై 2015లో జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy