పాక్ కాల్పులు..నలుగురు జవాన్లు మృతి

DEATHపాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో నలుగురు BSF జవాన్లు అమరులయ్యారు. కాల్పుల్లో మరో ముగ్గురు BSF జవాన్లకు గాయాలయ్యాయి.  అమరులైన వారిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ జతిందర్‌ సింగ్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ రామ్‌ నివాస్‌, కానిస్టేబుల్‌ హన్స్‌ రాజ్‌ లుగా గుర్తించారు.

కొద్ది వారాల క్రితమే కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ ఆ ఒప్పందాన్ని అంతలోనే ఉల్లంఘించింది. జూన్ 3న పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అఖ్నూర్ సెక్టార్లోని ప్రగ్వాల్ ఏరియాలో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో BSF  దళాలకు చెందిన ఏఎస్ఐ, జవాన్ అమరులయ్యారు. కాల్పుల విరమణ పాటిద్దామని హాట్ లైన్ ద్వారా పాకిస్థాన్ DGMO మే 29న చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది భారత DGMO. ఈ ప్రతిపాదన తెచ్చిన నాలుగు రోజుల్లోనే బరితెగించిన పాక్ తన దురాగతాన్ని బయటపెట్టుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy