పాక్ తో మీటింగ్.. క్యాన్సిల్ చేసిన ఇండియా

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణం చేసినప్పట్నుంచీ అతడితో భేటీ ఉంటుందని భారత ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌ లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో .. భారత విదేశాంగ మంత్రి సమావేశం కానున్నట్లు ఇటీవల తెలిపారు సుష్మాస్వరాజ్.

అయితే ఈ భేటీని క్యాన్సిల్ చేసింది ఇండియా. జమ్మూ కశ్మీర్‌ లో రెండు రోజులుగా ఓ BSF జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇండియా.  ఓవైపు పాక్ రేంజర్లు భారత జవాన్లను ఊచకోత కోస్తుండటం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌ లో పోలీసులను హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్.. ఆ భేటీని క్యాన్సిల్ చేసింది. ఉగ్ర‌వాదుల‌ను స్మ‌రిస్తూ.. పోస్ట‌ల్ స్టాంపుల‌ను పాకిస్థాన్‌ రిలీజ్ చేయడాన్ని విదేశాంగ‌శాఖ ప్రతినిధి ర‌వీష్‌కుమార్ త‌ప్పుబ‌ట్టారు. ఇమ్రాన్ ఖాన్ అస‌లు స్వ‌రూపం వీటి ద్వారా బ‌య‌ట‌ప‌డింద‌ని విమ‌ర్శించింది ఇండియా.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy