పాక్ పై పీవీ ఎక్కుపెట్టిన అస్త్రం వాజ్ పేయి

జెనీవా నగరంలో 1994లో జరిగిన ఐక్య రాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌ ప్రత్యేక సదస్సులో భారత ప్రతినిధిగా వాజ్‌పేయీ పాల్గొన్నారు. నిజానికి అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే సదస్సులో భారత బృందానికి వాజ్‌పేయీ నాయకుడిగా ఉండాలని అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ సదస్సులో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని  తీవ్రంగా ప్రయత్నించింది పాకిస్థాన్‌. పాక్‌ ఆరోపణలను వాజ్‌పేయీ నేతృత్వంలోని బృందం సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో ఆ దేశంపై భారత్‌ దౌత్య విజయం సాధించింది. ఆ విజయానికి కారణం వాజ్‌పేయీ. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన పీవీ చర్యను చాలా మంది అభినందించారు. అయితే తనను సదస్సుకు పంపడం వెనుక పీవీ వ్యూహం వేరే ఉండొచ్చంటూ  ఓ పర్యాయం లోక్‌సభలో నవ్వులు పూయించారు వాజ్‌పేయీ. ‘‘పీవీ గొప్ప వ్యూహ రచయిత. జెనీవాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే.. నన్ను బలిపశువును చేయొచ్చని కూడా భావించే నన్ను ఆ బృందానికి నాయకుడిగా పెట్టి ఉండొచ్చు’’ అంటూ వాజ్‌పేయీ తనదైన హాస్యచతురతను ప్రదర్శించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy