పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు

అవెన్‌ఫీల్డ్‌ కేసులో పాకిస్తాన్  మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుటుం బానికి ఊరట లభించింది. ఈ కేసులో నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియం నవాజ్‌ను విడుదల చేయాలని బుధవారం(సెప్టెంబర్-19) ఇస్లామాబాద్‌ హై కోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్‌బేస్‌ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. గత వారం… లండన్ లో కాన్సర్‌తో చనిపోయిన షరీఫ్‌ భార్య, కుల్సోంకు అంత్యక్రియల కోసం నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె 5 రోజుల పెరోల్‌ మీద విడుదలయ్యారు. జస్టిస్‌ అథర్‌ మినల్లా, జస్టిస్‌ మియంగుల్‌ హసన్‌ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్‌ కోర్టు రద్దు చేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి ఎలాంటి రుజువు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్లు, మరియం నవాజ్‌కు 8 ఏళ్ల శిక్ష పడింది.ప్రస్తుతం ఆయన అడియాలా జైలులో ఉన్నారు. రూ.5 లక్షల బాండ్‌ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గుర్ని రిలీజ్‌ చేయా లంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. కెప్టెన్‌ సఫ్‌దార్‌ కూడా ఈ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy