పాక్ లో ఆత్మాహుతి దాడి.. 22 మంది మృతి

parachinarపాకిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.  వాయువ్య గిరిజన ప్రాంతంలో  ఈ దుర్ఘటన జరిగింది. కారులో వచ్చిన ముష్కరుడు పరాచినార్‌లోని సెంట్రల్ బజార్‌లో షియా ఇమామ్‌బరాగ్ మసీదు మెయిన్ గెట్ దగ్గర ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతంలోని అన్ని హాస్పిటల్స్ లోను హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించారు. ఆర్మీకి చెందిన వైద్యులను దాడి జరిగిన ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్లు పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదలవ్వలేదు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy