పాక్ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వం

adnan-sami 111పాకిస్థాన్ సింగర్ అద్నాన్ సమీ కల నెరవేరింది. భారత పౌరసత్వం పొందాలనుకుంటున్న అద్నాన్ చివరికి దాన్ని దక్కించుకున్నాడు. సమీకి భారత పౌరసత్వం ఇస్తూ.. ప్రకటన జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. 2016 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. 2001 మార్చిలో తొలిసారి ఇండియాకు వచ్చాడు అద్నాన్. అప్పటి నుంచి ఏటా తన విజిటింగ్ వీసాను రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది మే 26న ఆయన పాకిస్థాన్ పాస్ పోర్టు గడవు ముగిసింది. దీంతో మానవతాదృక్పథంతో తనకు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ కేంద్ర హోం మినిస్ట్రీకి విన్నవించుకున్నాడు. సమీ అభ్యర్థనను మన్నించిన కేంద్రం ఇండియన్ సిటీజన్ షిప్ అందించింది.

కభీతో నజర్ మిలావో, లిఫ్ట్ కరా దే పాటలతో కొద్ది కాలంలోనే మాంచి ఫేమ్ సాధించాడు అద్నాన్ సమీ. దక్షిణాదిన కూడా తనేంటో నిరూపించుకున్నాడు. తెలుగులో ఓ మధు(జులాయి), భూగోళమంతా సంచిలోనా(శంకర్ దాదా జిందాబాద్), నైజామ్ పోరి(వర్షం) పాటలు సమీకి మంచి పేరు తెచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువగా పాడాడు సమీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy