పాటలు, డాక్యుమెంటరీలతో రైతుల్లో చైతన్యం

kcrరాష్ట్రంలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు పాటలు, రచనలు, డాక్యు మెంటరీల ద్వారా భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసా రైతాంగంలో కలిగించాలన్నారు. రైతు సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని పథకాలు తెస్తామని చెప్పారు. అవన్నీ సక్రమంగా అమలు చేసే బాధ్యత ను రైతు సంఘాలకు అప్పగిస్తామని వెల్లడించారు. రైతు స్వర్ణయుగానికి రైతు సంఘాలు నిజాయితీగా పని చేయాలని సూచించారు. శనివారం (మే13) ప్రగతి భవన్‌లో పలువురు సినీ కవులు, దర్శకులు, రచయితలతో సీఎం చర్చించారు.

వ్యవసాయాభివృద్ధి–రైతు సంక్షేమం కోసం రచనలు చేస్తామని, డాక్యుమెంట రీలు రూపొందిస్తామని సమావేశానికి హాజరైన ప్రముఖులు చెప్పారు. ఉద్యమ సమయంలో తాము రాసిన అనేక పాటలకు కేసీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని, ఆయన మాటలే పల్లవులుగా పాటలు రాశామని  సినీ కవి సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం కేసీఆర్‌ నిండు మనసుతో పనిచేస్తున్నారని, తాము కూడా ప్రజలకు ఉపయోగపడే పాటలు రాస్తామని సినీ గేయ రచయిత చంద్రబోస్‌ చెప్పారు. కేసీఆర్‌ ఏదైనా చెప్తే మొదట అపోహలు ఏర్పడతాయని, తర్వాత ఊహలా అనిపి స్తుందని, తర్వాత ఉద్యమ రూపం తీసుకుంటుందని, చివరికి నిజం అవుతుందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ అన్నారు. గ్రామాల్లో చెరువులు బాగుపడ్డాయని, ఊర్లు బాగుపడ్డాయని, పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. ఇదంతా పాటల్లో చూపిస్తామని గేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ కలలు కంటున్న గొప్ప తెలంగాణ నిర్మాణంలో తాను పాలుపంచుకుంటానని దర్శకుడు, నటుడు ఉత్తేజ్‌ చెప్పారు.  ఉద్యమ సమయంలో పనిచేసి అనేక పాటలు రాశామని, అదే స్ఫూర్తితో ఇప్పుడూ పాటలు రాస్తానని ప్రముఖ కవి గోరటి వెంకన్న చెప్పారు. కేసీఆర్‌తో సంభాషణ తమకో అధ్యయనంలా సాగిందని, ఆయన ఆశిస్తున్న తెలంగాణను సాధించేందుకు తనవంతు పని చేస్తానని తరుణ్‌ భాస్కర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సార థి చైర్మన్‌ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ , సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, ఎమ్మె ల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy