
పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే.. అతను పూణే వాసి బుల్లెట్ భన్వరీ లాల్ యాదవ్. బీహార్ కు చెందిన భన్వర్ లాల్ పూణేలో స్థిరపడ్డాడు. బోజ్ పురీ పాటలు పాడటంలో మనోడు దిట్ట. దీంతో తన గాత్రాన్ని బచ్చన్ సాబ్ కు వినిపించాలనే కుతూహలంతో గోడదూకి వచ్చేశాడట ఆ అభిమాని. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అమితాబ్ ను కలిశాడా లేదా అనేది క్లారిటీ లేదు.