పాడితోనే రైతులకు చేతినిండా డబ్బులు : తలసాని

పాడితోనే రైతులకు చేతినిండా డబ్బులు అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం (ఆగస్టు-11) వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తలసాని.  ముల్కనూరు మహిళా సహకార డైరీలో అర్హులైన 88 మంది మహిళలకు బర్రెలను పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో రూ. 110.87 కోట్లతో పాల ఉత్పత్తిదారులకు బర్రెలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. గొప్ప సంకల్పం ఉన్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో ఉన్న ప్రధాని కానీ..రాష్ట్రపతికి గానీ..లేని ధైర్యం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు మంత్రి తలసాని. మన రాష్ట్రం వస్తే..ఏంచేస్తే ప్రజలు బాగుపడుతారని ఆలోచించే గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. దేశంముందు తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని చెప్పారు. పాడిపరిశ్రమలో భాగంగా రైతులకు బర్రెల పంపిణీ చేయడం దేశానికే తెలంగాణ ఆదర్శం అన్నారు. నాలుగు రూపాయల ప్రోత్సాహం..ప్రతి నెల 60 లక్షలు అవుతుందని చెప్పారు. దీంతోనే ఆవులు, బర్రెల పంపిణీకి శ్రీకారంచుట్టామని తెలిపారు. బర్రెలకు 70 నుంచి లక్షకు పైగా ధరలున్నప్పటికీ ..వెనుకడుగు వేయకుండా 50శాతం సబ్సీడీకి ధైర్యంగా ముందుకు వచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు.

చేపలు, గొర్రెలు పంపిణీ చేయడం వేరు కానీ..బర్రెలు పంపిణీ చేయడం సాహసంతో కూడిన పని అని తెలిపారు.  బర్రెల పంపిణీతో పాటు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని అలాగే దాన కూడా ఉంటుందన్నారు. గొల్లకుర్మ, నేతన్న గీతన్న, ముదిరాజ్ అనే తేడా లేకుండా అందరికీ సాయం చేకూరుతుందన్నారు. రైతన్నలకు 24 గంటల కరెంటు, కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులతో సాగునీరందిస్తామని తెలిపారు.  దీంతోపాటు ఇంటింటికీ మంచినీరు ఇచ్చే పథకం మిషన్ భగీరథ శరవేగంగా పూర్తి చేసుకుందన్నారు. పెట్టుబడి కింద రైతులకు ఎకరాకు 4వేలు ఇవ్వడమే కాకుండా..రైతుబీమాతో రూ. 5లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, విద్యార్థులకు సన్నబియ్యం, లాంటి పథకాలను ప్రవేశపెట్టిన మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు తలసాని. నీళ్లు, నిధులు, నియామకాలే ముఖ్యమనే దిశగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని కులాలవారు పాడిపంటలపై ఆధారపడుతారని..ఇందులో భాగంగానే బర్రెల పంపిణీ జరుగుతుందని తెలిపారు మంత్రి తలసాని.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy