పాత కార్లకే డిమాండ్ ఎందుకు…?

carకొత్తొక వింత పాతొక రోత.. ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదేమో. కొత్త కార్ల కంటే పాత కార్లకే ఇప్పుడు మార్కెట్లో క్రేజ్. కార్ల తయారీ కంపెనీలే సొంతంగా యూజ్డ్ కార్ల షోరూం తెరుస్తున్నాయి. వీటి డిమాండ్ అలా ఉంది. పాత కార్లనే ఎందుకు కొంటున్నారు.. వీటివల్ల ఉపయోగాలేంటి.. కొనేటప్పుడు ఏయే విషయాలు చూడాలి.. ఇలాంటి సందేహాలను తీర్చేందుకే స్పెషల్ స్టోరీ.

పెరగుతున్న ఇన్ ఫ్లేషన్.. పెరిగిన వడ్డీ రేట్లతో భారమవుతున్న EMI.. మరో పక్క కారు ఉండాల్సిందేనని అంటున్న మధ్యతరగతి.. ఇలా చాలా కారణల వల్ల కొత్త కార్ల కంటే పాత కార్లే ఇప్పుడు ఎక్కవ డిమాండ్ ఉంది. ఆటో ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ప్రతి కొత్త కారుకు సమానంగా పాత కార్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో 50 ..60 వేల రూపాయలకు వచ్చే మారుతి ఎయిట్ హండ్రెడ్ నుంచి 25 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్  వరకు ఉన్నాయి.

మెరుగవుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు విలాసాల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు కారు.. లగ్జరీ నుంచి అవసరంగా మారింది. కొత్త కారు కొనలేని వారు కనీసం పాత కారైనా కొని మాకూ కారుందోచ్.. అని ఆ కొరిక తీర్చుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ సర్వేలో తేలిన గణాంకాల ప్రకారం మొదటి సారి కారు కొంటున్నవారిలో 65 శాతం మంది పాత కార్లనే కొంటున్నారు. కారణం డ్రైవింగ్ లో ఫర్ ఫెక్ట్ అయిన  తర్వాత  కొత్త కారు కొందామనుకుంటున్నవారు ఎక్కవ కావడమే. మరో పక్క లగ్జరీ కార్లు ఫస్ట్ హ్యాండ్ ధరలో సగానికే అది మూడేళ్లు నాలుగేళ్లు వాడినవి మార్కెట్లో  అమ్మకానికి వస్తుండటంతో వీటిని కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఆర్గనైజ్డ్ మార్కెట్లో నాలుగేళ్ల క్రితం  పదహారు లక్షలు గా ఉన్న యూజ్డ్ కార్ మార్కెట్  ఇప్పుడు ఆరవై   లక్షల స్థాయికి చేరుకుంది. ఈ కార్ల మార్కెట్ ఏటా 20 నుంచి 25 శాతం పెరుగుతోంది. మరో మూడేళ్లలో సెకండ్ హేండ్ కార్ల అమ్మాకాలు సుమారు కోటి 20 లక్షలకు చేరుకుంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా.. ఇప్పటి వరకు మారుతి 800, ఆల్టో, వ్యాగన్ ఆర్, హుందాయ్.. సాంత్రో, చెవర్ లెట్ స్పార్క్  లాంటి ఎంట్రి లెవల్ కార్లకు యూజ్డ్ కార్ల మార్కెట్ లో బాగా డిమాండ్  ఉండేది. తాజాగా బి సెగ్మెంట్ కార్లయిన మారుతి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, హుందాయ్ వెర్నా, ఐ టెన్ లాంటి వాటితో పాటు లగ్జరీ కార్లైన మెర్సిడెజ్ బెంజ్, హోండా అక్కార్డ్, ఫోర్డ్, టయోటా కరోలా తదితర మోడల్స్ కు కూడా సెంకండ్ హేండ్ మార్కెట్లో బాగా డిమాండ్ పెరుగుతోంది. కస్టమర్లు అప్ గ్రేడేషన్ వెర్షన్లు వైపు ఆకర్షితులవుతుండంటం కూడా యూజ్డ్ కార్ల మార్కెట్ పెరగాడానికి  కారణమతోంది.

కొత్త కార్ల సేల్స్ పెరిగాయి. యూజ్ డ్ కార్ సేల్స్ అమ్మకాలైతే దూసుకెళ్తున్నాయి. ఒక్క మనరాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతి 5 నిమిషాలకు ఓ సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముడవుతుంది. మరో ఐదుళ్లు కొనసాగితే.. రోడ్లపై తిరిగే కాళ్లకంటే.. కార్లే ఎక్కువ. మరి మీరు సెకండ్ హేండ్ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..

మార్కెట్లో దొరుకుతున్న సెకండ్ హేండ్ కార్ల ధరలు తక్కువే అయినా వాటిని కొనే ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. కారును  అమ్ముతున్న వారి క్రెడిబిలిటి ఏమిటి .. కారు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ముందుగా మీరు ఏ కారు కొనాలన్నదానికంటే మీ బడ్జెట్ ఎంతో నిర్ణయించుకోవాలి. అందులోనే మీకు నచ్చిన కంపెనీ మోడల్ ను ఎంపిక చేసుకోవాలి. కారు ధర.. దాన్ని వాడిన కాలాన్ని బట్టి నిర్ణయిస్తారని తెలుసుకోండి.  ఉదాహారణకు మీరు ఎంచుకున్న కారు మోడల్ కొత్తది ఐదు లక్షల రూపాయలుంటే అదే సెకెండ్ హేండ్ మార్కెట్లో  కారు తిరిగిన కీలోమీటర్ల బట్టీ  లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు  ఉంటుంది.

మీరు ఎంతలో కారును కొనులనుకుంటున్నారనేది నిర్ణయించుకున్న తరువాత మీ వాడకాన్ని బట్టీ ఏ మోడల్ కారు సూటవుతుందో తెలసుకోవాలి.. రోజుకు 60 కిలోమీటర్ల పైగా  తిరిగే వారైతే డీజీల్ కారు కొనడం బెస్ట్. వారానికి ఓ సారో లేదా రెండు సార్లు అవసరాన్ని బట్టీ కారును ఉపయోగించే వారైతే పెట్రోల్ కారు కొనడం మంచిది.  సాధ్యమైనంత వరకు రెండు మూడేళ్ల కు పైగా  వాడిన  పాత కారును కొనకపోవడమే మంచిది. కనీసం 40 వేల కిలోమీటర్ల లోపు తిరిగిన కారైతే బెటర్.. ఉదాహరణకు మీ బడ్జెట్ మూడు లక్షల రూపాయలైతే  వన్ ఇయర్ ఓల్డ్ సాంత్రో కాని వ్యాగన్ ఆర్ కాని దొరుకుంతుంది. అదే మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయగలిగితే .. ఫోర్డ్ ఫియస్టా కానీ హోండా సిటీ  లాంటి పెద్ద కార్లు ఆరేడేళ్లకు పైగా వాడినవి దొరుకుతాయి. ఇక్కడ  గమనించాల్సిన విషయం ఏమిటంటే చిన్న కార్ల కంటే పెద్ద కార్లకు మెంటెనెన్స్ ఖర్చు ఎక్కువ.  ఉదాహరణకు చిన్న కార్లకు ప్రతి పదివేల కిలోమీటర్లకు సర్వీసింగ్ కోసం సుమారు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చయితే అదే పెద్ద కార్లకు  ఎనమిది వేల రూపాయలకు పైగానే అవుతుంది.  మరో విషయం ఏమిటంటే అనుకోకుండా వచ్చే రిపేర్లలో చిన్న కార్లు కు ఉపయోగించే స్పేర్ పార్ట్స్ ధర కంటే  పెద్ద కార్లకు ఉపయోగించే వాటి ధర దాదాపు రెండింతలుంటుంది. సో మొదటి సారిగా కారు కొనే వారు చిన్న కారు కొంటేనే మంచిది. సెకెండ్ హేండ్ కారు కొనేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకోవాలో బహుశా మీకు ఇప్పుడు అర్ధమయ్యిందనుకుంటాను. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఏ కారు కొన్నాదాన్ని మళ్లీ అమ్మితే దేనికి ఎక్కవ రీ సేల్ వాల్యూ ఉంటుందో ఆ మోడల్ ను కొంటే మంచిది.

 

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy