పాపం పండింది : 22 ఏళ్ల తర్వాత దొరికిన దొంగ

thiefదొంగ తనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా నిలిచిన ఓ దొంగ పట్టుబడ్డాడు. దొంగతనం చేసిన 22 ఏళ్ల తర్వాత. అది కూడా వేలిముద్రల సాయంతో అడ్డంగా దొరికాడు.

హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన హబీబ్ అలియాస్ చోటు అలియాస్ యుసుఫ్ చిన్నతనం నుంచే దొంగతనాలకు పాల్పడేవాడు. మొదటి సారిగా 1995 లో హబీబ్ అతని ఫ్రెండ్స్ సంజయ్, సర్వార్తో పాటు, హర్షద్ తో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. వీరిని జువైనల్ హోం కు తరలించారు. ఆ సమయంలో వారి వేలి ముద్రలు తీసుకున్నారు. అక్కడి నుంచి విడుదైలన తర్వాత కూడా దొంగ తనాలు మానలేదు. నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఇళ్లలో పడి నగలు,నగదు దోచుకెళ్లడం చేసేవాడు.

కొద్ది రోజుల క్రితం అమీర్ పేట్ లోని ఓ ఇంట్లో దోపిడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా  క్లూస్ టీం అధికారులు వేలి ముద్రలు సేకరించారు. అయితే ఆ వేలి ముద్రలు హబీబ్ వేలి ముద్రలను సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హబీబ్ నుంచి కిలో బంగారం,2.5 కిలోల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హబీబ్ పై నార్సింగ్,అమీర్ పేట్,బాలాపూర్,హయత్ నగర్,పహాడీషరీఫ్, ఎల్బీనగర్,చైతన్యపురి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో 26 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy