పాము పగబట్టిందని.. బాడీ గార్డులను పెట్టుకున్నాడు

Snakeపాము పగబడితే.. ఎన్నాళ్లైనా విడవదంటారు. ఈ మాట వినడమే కానీ… చూసింది ఎప్పుడూ లేదు. ఉత్తరప్రదేశ్ షాజన్ పూర్ వెళితే దీన్ని చూడొచ్చు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా.. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఇలాగే సర్ ప్రైజ్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. షాజన్ పూర్ కు చెందిన యువకుడికి బాడీగార్డులు రక్షణగా ఉన్నారు. నలుగురు నాలుగు తుపాకులతో అనుక్షణం జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంతకూ ఎందుకో తెలుసా.. ఓ పాము అతనిపై పగబట్టింది. 2013 నుంచి అతన్ని వెంటాడుతోంది. ఆ సమయంలో ఆ యువకుడు ఓ మగ పామును చంపాడు.. నాటి నుంచి దానితో జతకట్టిన ఆడ పాము అతణ్ని వెంటాడుతోంది. అప్పటి నుంచి అతనికి ఈ బాడీగార్డుల పని తప్పలేదు.. దాని బారి నుంచి తన ప్రాణాలు కాపాడుకోడానికి ఆ యువకుడు తంటాలు పడుతున్నాడు. అతడు ఎక్కడికి వెళ్లినా.. వారంతా తుపాకులతో కాపలాగా వెళుతున్నారు. అయితే దీన్ని అక్కడి అధికారులు కొట్టిపడేస్తున్నారు. ఎక్కడో ఏదో పాముని చూసి అప్పటి నుంచి అలా భయపడుతున్నాడేమోనని అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy