పారాషూట్ స‌హాయం లేకుండానే దూకాడు

luke 125వేల అడుగుల‌ ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి కింద‌కు దూకాడు లూక్ ఐకిన్స్ (42) అనే స్కైడైవ‌ర్‌. అయితే ఈ ఘ‌న‌త‌ను ఎలాంటి పారాష్యూట్ స‌హాయం లేకుండానే సాధించాడు. ఎంతో ధైర్య‌సాహ‌సాల‌తో ఈ ఫీట్‌ను సాధించాడు లూక్‌. ఇప్ప‌టికే 18000 జంప్‌ల‌ను స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన లూక్ వాట‌న్నిటినీ పారాష్యూట్ స‌హాయంతో చేశాడు. అయితే తాజా జంప్ మాత్రం చాలా స్పెష‌ల్ అనే చెప్పాలి.  ఈ ఫీట్‌కు కాలిఫోర్నియా ఎడారి వేదిక‌గా నిలిచింది. ఈ ఫీట్ కోసం దాదాపు 18 నెల‌లు ట్రైనింగ్ తీసుకున్నాడు లూక్‌.

luke 2 23వేల అడుగుల‌ ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి దూకి…18వేల అడుగులు చేరుకునే వ‌ర‌కు ఆక్సిజ‌న్ మాస్క్ ధ‌రించాడు. వంద అడుగుల‌కు చేరుకోగానే ఓ వ‌ల‌లో సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. లూక్ చేస్తున్న ఈ ఫీట్‌ను చూసేందుకు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy