పార్టీ ఛేంజ్ అంతే : సీఎంగా నితీష్ ప్రమాణం

nithishసరిగ్గా 14 గంటల వ్యవధిలో సీఎం నుంచి ఆపధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం. బీహార్ అత్యంత వేగంగా మారిపోయిన రాజకీయ పరిణామాలకు ఇది ఎగ్జాంపుల్. బుధవారం సాయంత్రం 6.30గంటలకు రాజీనామ చేశారు. ఆ వెంటనే బీజేపీ మద్దతుతో గవర్నర్ ను కలిశారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎంగా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ KN త్రిపాఠి ప్రమాణం చేయించారు.

జనతాదళ్ పార్టీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 51 మంది అవసరం ఉంది. బీజేపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే నితీశ్ కు మరో ఇద్దరు అదనంగానే మద్దతు ఇస్తున్నారు. బల నిరూపణ కూడా లాంఛనమే. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

అర్థరాత్రి హైడ్రామా

నితీశ్ రాజీనామా తర్వాత.. బుధవారం అర్థరాత్రి ట్విస్ట్ లపై ట్విస్టులు. జనతాదళ్ పార్టీ అత్యవసరంగా భేటీ అయ్యింది. మరోవైపు NDA కూటమి (బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్ పీ) ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. శాసనసభాపక్ష నేతగా నితీశ్ కు మద్దతు ప్రకటించాయి. ఆ వెంటనే ఒంటి గంట సమయంలో గవర్నర్ ను త్రిపాఠిని కలిసి మద్దతు లేఖ అందించారు నితీశ్. ఆ తర్వాత బీజేపీ, ఇతర పక్షాలు కూడా గవర్నర్ తో భేటీ అయ్యాయి. లెక్కలు చూసుకున్న గవర్నర్.. ప్రమాణ స్వీకారానికి సీఎంను ఆహ్వానించారు. గురువారం ఉదయం లాంఛనాలు కూడా పూర్తయ్యాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy