
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వాచ్ డాగ్ లా పనిచేస్తుందని పొన్నాల తెలిపారు. అన్ని వర్గాల వారిని పార్టీలో భాగస్వామ్యం చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి జిల్లా, మండల, నియోజకవర్గా వారీగా చర్చలు జరుగుతాయని…అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని…పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని ఆయన మరోసారి గుర్తు చేశారు.