పార్లమెంటులో టైమ్ వేస్ట్ !

parliament

ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో కేవలం నిర్ణీత కాలంలో 24 శాతం మాత్రమే వ్యవహారాలు నడిచాయి. ఫిబ్రవరి 5 న మొదలైన ఈ సెషన్ లో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల గొడవతో లోక్ సభ, రాజ్య సభ దద్దరిల్లాయి. ఈ గొడవతో లోక్ సభలో వేస్టయిన టైమ్ 79 శాతం. రాజ్యసభలో వేస్టయిన టైమ్ 73 శాతం. లోక్ సభలో స్టార్ గుర్తున్న ప్రశ్నలు 220 ఉంటే, వాటిలో 8 ప్రశ్నలకు మాత్రమే జవాబుల వచ్చాయి. రాజ్య సభలో అయితే ఒక్కటంటే ఒక్క స్టార్ ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేదు.  ఈ సెషన్ లో 12 బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. 15 వ లోక్ సభలో మొత్తం 177 బిల్లులు ఆమోదిస్తే, ఇప్పటికీ 128 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy