పార్లమెంట్ కు GST వెలుగులు

parlimentచరిత్రాత్మక ఘట్టానికి భారత పార్లమెంట్ వేదిక కాబోతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో అర్ధరాత్రి జే గంట మోగబోతోంది. జీఎస్టీ అమలు కార్యక్రమానికి అంతా రెడీ అయ్యింది. పార్లమెంట్ భవనం విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో అర్ధరాత్రి ఇలాంటి సమావేశం జరగడం ఇది నాలుగోసారి.

పది గంటల 45 నిమిషాలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ప్రత్యేక సమావేశానికి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. రాష్ట్రపతి సభావేదికకు రాగానే.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత ప్రధాని మోడీ, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం ఉంటుంది. జీఎస్టీ తీసుకురావాల్సిన అవసరాన్ని, జీఎస్టీ జరిగే లాభాలను ప్రధాని మోడీ వివరిస్తారు.

ఇద్దరి ప్రసంగం అయ్యాక సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు జీఎస్టీ అమలుకు సూచకంగా ప్రధాని నరేంద్రమోడీ… జే గంట మోగిస్తారు. తర్వాత జీఎస్టీపై రూపొందించిన 2 నిమిషాల నిడివి ఉన్న షార్ట్ ఫిలింను ప్రదర్శిస్తారు. దాదాపు 80 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

సభా వేదికపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీతో పాటు.. ఉపరాష్ట్రపతి  హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ కూర్చుంటారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వస్తే ఆయన కూడా వేదిక మీద ఉంటారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా ఇందులో పాల్గొంటారు.

ఈ వేడుకకు చాలా మంది వీఐపీలకు ఆహ్వానాలు పంపింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. అన్ని పార్టీల అధ్యక్షులు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులను పిలిచింది. అలాగే.. వివిద రంగాల్లో ప్రముఖులైన 100 మందికి  ఆహ్వానాలు పంపింది. వ్యాపారవేత్త రతన్ టాటా, గాయని లతా మంగేష్కర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్,  వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్, సోలీ సొరాబ్జి, కేకే వేణుగోపాల్, హరీశ్ సాల్వే, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ మాజీ గవర్నర్లు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy