పార్ల‌మెంట్‌లో కోతి చ‌క్క‌ర్లు

monkeyబిల్డింగ్ బావుంద‌నుకుందో.. లేక స‌మావేశాలు చూద్దామ‌నుకుందో తెలియ‌దు గానీ… ఓ కోతి నేరుగా పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించింది.
ఓ వైపు పార్ల‌మెంట్ స‌మావేశాల‌తోఎంపీలు బిజీగా ఉండ‌గా… ఈ కోతి అక్క‌డ చ‌క్క‌ర్లు కొట్టింది. సెంట్ర‌ల్ హాల్‌కు స‌మీపంలో ఉన్న లైబ్ర‌రీలోకి ద‌ర్జాగా వెళ్లింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఇద్ద‌రు ఎంపీలు ఉన్నారు. టేబుల్ పైకి ఎక్కి నానా హంగామా క్రియేట్ చేసింది ఆ కోతి. ఆ త‌ర్వాత గ్యాల‌రీలో ఉన్న విద్యుత్ తీగ‌ల‌ను ప‌ట్టుకుని పైకి ఎక్కి దిగింది. బ‌య‌ట‌కు ఎటు వెళ్లాలో తెలియ‌క దాదాపు అర‌గంట‌పాటు ఈ కోతి ఇబ్బంది ప‌డింది, చివ‌ర‌కు వీఐపీల కోసం ఉన్న ప్ర‌ధాన ద్వారం గుండా రాయ‌ల్‌గా న‌డుచుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy